Nov 07,2023 16:35

అలంపూర్‌: రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరూపిస్తే.. తాను నామినేషన్‌ వేయనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. జోగులాంబ గద్వాలజిల్లా అలంపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గోన్నారు. ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ బిఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మరింత మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామనిహామీ ఇచ్చారు. ఆర్డీఎస్‌ సమస్యను పరిష్కరించే బాధ్యతను సంపత్‌ కుమార్‌, తాను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్‌ పథకం తీసుకొచ్చేందే కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. జోగులాంబ ఆలయం అభివఅద్ధి గురించి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.