భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాదేశ్‌తో నిన్న (జులై 22) జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ.. బ్యాట్‌తో వికెట్లను కొట్టనందుకు గాను, అలాగే ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా అంపైర్లపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసినందుకు గాను హార్మన్‌కు ఐసీసీ జరిమనా విధించింది.
Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb
— Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023
హర్మన్ వ్యవహరించిన తీరును దురుసు ప్రవర్తనగా పేర్కొన్న ఐసీసీ.. ఆమె మ్యాచ్ ఫీజ్‌లో 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. హర్మన్ ప్రవర్తనను లెవెల్ 2 అఫెన్స్ కింద పరిగణించిన ఐసీసీ.. ఆమెకు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. జరిమానాలో 50 శాతం ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనకు, 25 శాతం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది. అలాగే 3 డీమెరిట్ పాయింట్లు ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనకు, ఓ డీమెరిట్ పాయింట్ ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు వివరించింది.
Bangladesh-W captain & her team left the photo session after Indian-W captain Harmanpreet Kaur told them,
— SazzaDul Islam (@iam_sazzad) July 23, 2023
-“Why you are only here? You haven't tied the match. The umpires did it for you. Call them up! We better have photo with them as well.”
BCB to notify BCCI & ICC soon. pic.twitter.com/PnyEQxoYuC










