హైదరాబాద్ : తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనుండటంతో అన్ని శాఖల్లో అధికారులను మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే కొంత మందిని తెలంగాణ ప్రభుత్వం మార్చగా.. ఎన్నికల కోడ్ వచ్చిన తరువా ఈసీ పలు మార్పులు చేసింది. అయితే తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణపై వేటు పడింది. నాలుగేండ్లుగా ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ తరువాత ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈసీ ఆదేశాలతోనే అధికారులు బదిలీ చేశారు.










