ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేట పట్టణంలో గత ఆరు రోజులుగా మూతపడిన ప్రైవేట్ స్కూల్ (ఎంపిఎస్)ను తెరవాలంటూ ప్రజా ప్రతినిధులు పలు సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపుమేరకు ... ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులను మంగళవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే జోగేశ్వరరావు, జనసేన నేత లీలాకఅష్ణ, సిఐటియు నాయకులు కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ లను హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం మండపేట ఎంపిఎస్ స్కూల్ నుండి స్థానిక కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ రాస్తారోకో నిర్వహించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, తల్లిదండ్రులపై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం నుంచి మండపేట పట్టణ పరిధిలో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని రాస్తారోకోలు, ధర్నాకు అనుమతి లేదని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.










