Sep 30,2023 10:04

తిరువనంతపురం : కేరళలో గత రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసాయి. వచ్చే రెండు రోజుల్లోనూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం కురిసిన వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పతనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్‌, మలప్పురం, కోజికోడ్‌, అలప్పుజా, కొట్టాయం, కన్నూర్‌, కాసరగోడ్‌ సహా 10 జిల్లాలకి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో కేరళలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. చేర్యాల 15 సెం.మీ, వడక్కన్‌చేరి 12 సెం.మీ, తైకాట్టుస్సేరి 12 సెం.మీ, అలప్పుజా 11 సెం.మీ, వైకోమ్‌ లో 11 సెం.మీ. వర్షపాతం'' నమోదైనట్లు పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.