Oct 29,2023 08:29

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ (విజయవాడ) : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడి గుండెను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా తిరుపతికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన 23 సంవత్సరాల యువకుడు ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ నెల 25 రాత్రి తొమ్మిది గంటల సమయంలో నిడుమోలు గ్రామంలో పని ముగించుకుని తన ఊరు వెళ్లడానికి మచిలీపట్నం- విజయవాడ రహదారి దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢకొీంది. ఈ ప్రమాదంలో తలకు బలైమన గాయమవ్వడంతో విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆయుష్‌ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్‌డెడ్‌ అయినట్లుగా వైద్యులు గుర్తించా రు. అవయవదానానికి యువకుడి కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి, లివర్‌, ఒక కిడ్నీని గుంటూరులోని మణిపాల్‌ హాస్పటల్‌కు, ఒక కిడ్నీని విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్‌వి ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. గ్రీన్‌ఛానల్‌ ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి గుండెను తరలించారు.