ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడం వల్ల సమాజంలో శక్తివంతమైన వ్యవస్థ నిర్మాణం జరుగుతుందని ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు ఎన్‌ఆర్‌ఐ నాగేష్ కాకుబాల్ , రిటైర్డ్ ఇన్‌కం టాక్స్ ఆఫీసర్ సిఆర్ స్వామి అన్నారు. ఆదివారం ఆదోని రిక్రియేషన్‌లో క్లబ్ శ్రీఅశ్వత్థ నారాయణ దేవాలయం కళాభారత్ సేవా సమితి ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకొని కరాటే, యోగ, బాక్సింగ్, వెపన్స్, కర్ర సాము వంటి అంశాలపై ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు చదువుతోపాటు క్రీడలు బాల్యం నుండే అలవాటు చేసుకోవాలన్నారు క్రమం తప్పకుండా గేమ్స్ ఆడటం వల్ల శరీరం దఢంగా ఉండి మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు ఇలాంటి ఉచిత శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










