ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : తుగ్గలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి హరికష్ణ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ చందు నాయక్ గురువారం విలేకరులకు తెలిపారు. గత వారంలో జరిగిన ఖోఖో పోటీలలో జిల్లాస్థాయిలో విజయం సాధించారని, దీంతో రాష్ట్ర స్థాయికి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమర్రి గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇప్పటికే మహిళా విభాగం నుండి మానస ఖోఖో పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైందని, పురుషుల విభాగంలో రాష్ట్రస్థాయి ఖోఖోకు హరికృష్ణ ఎంపికైనట్లు తెలిపారు. ఈ ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు జయలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ మల్లికార్జున, ఉపాధ్యాయులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.










