Aug 20,2023 12:07

ఆనందం అనేది అందరికీ ఒకేలా ఉండదు.. అలాగే జీవితాంతం ఆనందం ఉండదు. ఒక వయసు వచ్చినప్పుడు ఆనందం మోడువారుతుంది.. అసలు ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది? దీనికి సైన్స్‌ ఏం చెబుతోంది? 'నడివయసు నైరాశ్యం' (మిడ్‌ లైఫ్‌ క్రైసిస్‌) నిజమేనా? ఈ ప్రశ్నలకు నిపుణులు చెప్తున్న మాట ఏమిటంటే..

/Happiness-will-sprout

జీవితంలో ఆనందపు రేఖ ఆంగ్ల అక్షరం 'యు' ఆకారంలో ఉంటుందని చెప్తున్నారు. ఈ అంశంపై 134 దేశాల్లో సమగ్ర అధ్యయనం చేసిన నిపుణులు 'నడి వయసు నైరాశ్యం' గురించి కూడా వివరించారు.
భిన్న సంస్కృతులకూ ఈ సంతోషపు రేఖ ఒకేలా ఉండటం ఒకింత ఆశ్చర్యమే. దాని ప్రకారం యవ్వనంలో మనం ఆనందంగా ఉంటాం. నలభైల్లోకి వస్తున్న కొద్దీ సంతోషం తగ్గుతూ వస్తుంది. వృద్ధాప్యంలో మళ్లీ ఆనందం చిగురిస్తుంది. అంటే జీవితం మొదట్లో, 50ల తర్వాత ఎక్కువ ఆనందంగా ఉంటుందన్న మాట. మధ్యలో మాత్రం మోడువారుతుంది.
వివిధ పద్ధతుల్లో ఆనందాన్ని కొలుస్తూ జరిగిన చాలా అధ్యయనాలు.. జనాలు అత్యంత తక్కువ ఆనందంగా ఉండే వయసు అభివృద్ధి చెందిన దేశాల్లో 47.2 ఏళ్లని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 48.2 అని లెక్కగట్టాయి.
'ఇది మనుషుల జన్యువుల్లోనే ఉంది. 'యు' ఆకారంలో ఉండే జీవితంలోని ఆనందపు రేఖ.. కోతులకూ వర్తిస్తుంది. 47 ఏళ్లప్పుడు మనుషులు ఎక్కువ వాస్తవికంగా ఆలోచిస్తుంటారు' అని నిపుణులు చెప్తున్నారు.
యాభై ఏళ్ల తర్వాత.. మళ్లీ ఉన్నదానితో సంతృప్తి చెంది, ఆనందంగా ఉండటం మొదలవుతుందని నిపుణులు అంటున్నారు.
'యాభైలలో ఉన్నవారికి శుభవార్తే. ఇక నుంచి మీ జీవితాలు మెరుగుపడతాయి. మీరు జీవించే పరిస్థితులు మెరుగుపడతాయని దీని అర్థం కాదు. ఏది ఆనందం అన్నదానిపై మీ దృక్పథం మారుతుంది' అని నిపుణులు వివరించారు.
'డెబ్భైలలో ఆరోగ్యంగా ఉంటూ, పనిచేస్తున్నందుకు సంతోషించేవాళ్లు ఉన్నారు. నడి వయసులో మాత్రం బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి' అని చెప్తున్నారు.
 

                                                                          అంచనాలు తక్కువ..

మనస్తత్వ శాస్త్రం ప్రకారం చూస్తే, నిపుణులు చేసే వాదనకు వివరణ దొరుకుతుంది. దాని ప్రకారం వయసు పైబడిన కొద్దీ తమ బలాబలాలను మనుషులు తెలుసుకుంటారు. సాధించలేని లక్ష్యాలను తగ్గించుకుంటారు. ఆశావహ దృక్పథంతో ఉండే మనుషులు ఎక్కువ కాలం బతుకుతారు. ఆనందపు రేఖ 'యు' ఆకారంలా తరువాయి 17 లో మారడానికి ఇదీ ఓ కారణం. సాధారణంగా ఆనందాన్ని ఆర్థికపరమైన విషయాలతో ముడిపెట్టి చూస్తుంటాం. ఆర్థికంగా సఫలం కాలేకపోతున్న పరిస్థితులు.. 40ల చివర్లో ఎక్కువగా బాధిస్తాయని నిపుణులు అంటున్నారు.
         పెద్దగా చదువుకోనివారిపై, నిరుద్యోగులపై, కుటుంబ బంధాలు సరిగ్గా లేనివారిపై, సన్నిహితులు ఎక్కువగా లేనివారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 'నడి వయసులో చాలా సున్నితమైన పరిస్థితుల్లో ఉంటాం. అందుకే సవాళ్లను ఎదుర్కోవడం ఇంకా కష్టమవుతుంది' అని నిపుణులు చెప్తున్నారు.
 

                                                                            మెదడులో మార్పులు

యాభైల తర్వాత జీవితం ఎందుకు మెరుగవుతోందో అన్న అంశంపై ఒక పరిశోధకుడు ఓ పుస్తకంలో విశ్లేషించారు. భిన్నరంగాల్లో ఉన్నవారిని ఇంటర్వ్యూ చేసిన ఆయన.. వయసు పెరుగుతున్న కొద్దీ లక్ష్యాల కన్నా, వ్యక్తులతో బంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మన మెదడులో మార్పులు వస్తున్నాయని గుర్తించారు. 'ఇది ఆరోగ్యకరమైన మార్పే. మన అంచనాలు మరీ అందనంత దూరంలో ఉన్నాయని తెలుసుకోవడం వల్ల నలభైల్లో నడివయసు నైరాశ్యం వస్తుంటుంది' అని రాచ్‌ అభిప్రాయపడ్డారు. లక్ష్యాలను సాధించినప్పుడు వచ్చే ఆనందం గురించి ఎక్కువగా ఊహించుకుంటూ యువతీయువకులు జీవితాల్లో తప్పుడు అంచనాలు వేసుకుంటుంటారు.
           వృద్ధులు మాత్రం అంచనాల భారాన్ని దింపేసుకుని, భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలనే నైపుణ్యాలను సంపాదించుకుంటారు.