Oct 24,2023 18:52

హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సెక్రటరీగా గెలిచిన దేవరాజ్‌, కౌన్సిల్‌ మెంబర్‌ సునీల్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వీరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హెచ్‌సీఏను ఉన్నతంగా తీర్చిదిద్ది రాష్ట్రానికి పేరు తేసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా పోటీ చేసిన అమర్నాధ్‌, శేష్‌ నారాయణ, శివాలాల్‌ యాదవ్‌ లు కూడా మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కాగా, ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా జగన్‌ మోహన్‌ రావు (యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సిఎ ప్యానెల్‌) విజయం సాధించారు. వైస్‌ ప్రెసిడెంట్‌ గా దళ్జిత్‌ సింగ్‌ (గుడ్‌ గవర్నెన్స్‌ ప్యానేల్‌), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్‌ ఫస్ట్‌ ప్యానెల్‌), జాయింట్‌ సెక్రటరీగా బసవరాజు (గుడ్‌ గవర్నెన్స్‌ ప్యానెల్‌), ట్రెజరర్‌గా సీజే శ్రీనివాస్‌ రావు (యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సిఎ ప్యానెల్‌), కౌన్సిలర్‌గా సునీల్‌ అగర్వాల్‌ (క్రికెట్‌ ఫస్ట్‌ ప్యానెల్‌) విజయం సాధించారు. జగన్‌ మోహన్‌ రావు ఒక్క ఓటుతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు.