Jan 04,2023 21:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైసిపి, టిడిపి విధానాలతో ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ అన్నారు. కాంగ్రెస్‌కు గణనీయమైన ఆధరణ పెరుగుతోందని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు నాయకులు, కేడర్‌ లేరనే అంశం తమకు సమస్య కాదని 1978లో రాష్ట్రంలో కాసుబ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు లాంటి నేతలను కాదని ప్రజలు ఇందిరాగాంథీకి పూర్తి మెజారిటి ఇచ్చారని, అదే తరహాలో 2024 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టనున్నారని చెప్పుకొచ్చారు. టిడిపి ప్రతిపక్షంలో నిలిస్తే వైసిపి దారుణంగా మూడో స్థానంలోకి పోతుందన్నారు. రాష్ట్రంలోని పేదరికం చూస్తుంటే 1960నాటి పరిస్థితితులు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయపార్టీలు సభలు, సమావేశాలు జరుపరాదని ఇచ్చిన జిఒ చీకటి జిఒ అని, జగన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.