Aug 02,2023 15:48

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పింగళి చిత్రపటానికి సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, పంచాయతీ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య స్వగ్రామం యార్లగడ్డలో పంచాయతీ కార్యదర్శి కొండవీటి మహేష్‌ సచివాలయం సిబ్బంది ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చల్లపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ ప్రాంగణంలో గల విగ్రహానికి సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్‌ కరీముల్లా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు మీర్‌ రిజ్వాన్‌, బిఎస్‌ఐ జిల్లా కోశాధికారి చోడాబత్తిన ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కొండేటి భాస్కరరావు, మాజీ ఎంపీటీసీ జగ్గవరపు బాబురావు,కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ నాయకులు షేక్‌ మహబూబ్‌ సుభాని పాల్గొన్నారు.

2