Aug 20,2023 12:29

ఇంగ్లీష్‌ గ్రామర్‌ మీద పట్టు లేని విద్యార్థులు, ఉద్యోగులు తమ వ్యాసాలు, ఫ్రేజ్‌లు, వాక్యాలు సరిగా టైప్‌ చేశామా లేదా అని భయపడుతూ ఉంటారు. గ్రామర్‌ సరిచూసుకునేందుకు చాట్‌జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ లాంటి లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ను ఎంచుకుంటారు. అయితే ఇకపై ఈ థర్డ్‌ పార్టీ యాప్స్‌ అవసరం లేకుండా గ్రామర్‌ చెక్‌ను ఇంకా సులభతరం చేసేందుకు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎఐ (కృత్రిమ మేధస్సు) టెక్నాలజీతో 'గ్రామర్‌ చెక్‌ ' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గూగుల్‌ డాక్స్‌, జీమెయిల్‌లో 'గ్రామర్‌ చెక్‌' ఫీచర్‌ను ఆల్రెడీ ఆఫర్‌ చేస్తోంది. వీటితో పాటు గూగుల్‌ సెర్చ్‌ ఉపయోగించే ఆప్షన్‌ను కూడా వినియోగదారులకు ఆఫర్‌ చేసింది. తద్వారా మల్టిపుల్‌ ఆప్షన్స్‌ ఇస్తూ గ్రామర్‌ చెక్‌ను మరింత సులభతరం చేసింది.

ఉదాహరణకు సెర్చ్‌ ఇంజిన్‌లో 'ది క్విక్‌ బ్రౌన్‌ ఫాక్స్‌ జంప్‌ ఓవర్‌ ది లేజీ డాగ్‌' అనే వాక్యంలో మీరు పొరపాటున జంప్‌కి బదులు జంప్స్‌ అని టైప్‌ చేస్తే.. జంప్స్‌ని గూగుల్‌ హైలెట్‌ చేస్తూ.. అది తప్పు అని సూచిస్తుంది. ఇది ప్రస్తుతం ఆంగ్ల బాషకు మాత్రమే అందుబాటులోకి ఉంది. భవిష్యత్తులో దీన్ని మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు గూగుల్‌ తెలిపింది.
 

                                                                      ఉపయోగించడం ఎలా ..

ఈ గ్రామర్‌ చెక్‌ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. ముందుగా గూగుల్‌ సెర్చ్‌ బాక్స్‌లో.. ఏదైనా పదం లేదా వాక్యాన్ని టైప్‌ చేయాలి. తరువాత 'గ్రామర్‌ చెక్‌' లేదా 'చెక్‌ గ్రామర్‌' లేదా 'గ్రామర్‌ చెక్కర్‌' అని టైప్‌ చేయాలి. అంతే.. మీరు టైప్‌ చేసిన పదం వ్యాకరణరీత్యా కరెక్ట్‌గా ఉందో లేదో తెలుపుతుంది. మీరు రాసిన పదం లేదా వాక్యం సరిగ్గా ఉంటే.. గూగుల్‌ గ్రీన్‌ చెక్‌ మార్కుని చూపిస్తుంది. ఒక వేళ తప్పుగా ఉంటే రెడ్‌ చెక్‌ మార్కుని చూపిస్తుంది. అయితే.. లోపాలు ఉంటే గూగుల్‌ ఆ వాక్యాన్ని సవరించి, దిద్దుబాట్లను హైలైట్‌ చేస్తుంది. స్పెల్లింగ్‌ తప్పులను కూడా పరిష్కరిస్తుంది. వాస్తవానికి కొన్నిసార్లు గ్రామర్‌ చెక్‌ అని కూడా టైప్‌ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ దీనిని ఉపయోగిస్తే.. గ్రామర్‌ చెక్‌ అనే టూల్‌ కచ్చితంగా పాప్‌ అప్‌ అవుతుంది. గూగూల్‌ గ్రామర్‌ చెక్‌ ఫీచర్‌ను డెస్క్‌ టాప్‌లోనూ, మొబైల్‌ ఫోన్‌లోనూ వినియోగించవచ్చు.
 

                                                                       ఎలా యాక్సెస్‌ చేయాలి ?

ఈ ఫీచర్‌ యాక్సెస్‌ చేయడానికి గూగుల్‌ .కామ్‌ (https://www.google.com) ఓపెన్‌ చేసి ఆంగ్ల వాక్యాలతో పాటు పక్కనే Grammar check  లేదా చెక్‌ గ్రామర్‌ అని టైప్‌ చేసి ఎంటర్‌ చేయాలి. ఉదాహరణకు ''  I loves India, grammar check '' అని టైప్‌ చేసి ఎంటర్‌ చేస్తే, సెర్చ్‌ రిజల్ట్స్‌లో పొరపాటును సరి చేసిన కరెక్ట్‌ వెర్షన్‌''  I love India '' అని చూపిస్తుంది. ఒకవేళ వాక్యం సరిగ్గా ఉంటే, దాని పక్కనే గ్రీన్‌ కలర్‌ టిక్‌ కనిపిస్తుంది. తప్పుగా ఉంటే, దాంట్లో గూగుల్‌ మార్పులు చేసి, చేసిన మార్పులు ఏంటో తెలియజేయడానికి సరిచేసిన వాక్యాన్ని బోల్డ్‌ స్టైల్‌లో హైలైట్‌ చేస్తుంది.