ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఏపీ పిటిడి ఎంప్లాయిస్ యూనియన్‌ను ప్రభుత్వం అతి పెద్ద సంఘంగా గుర్తించి జిఓ నెంబర్ 97 ద్వారా ప్రభుత్వ గుర్తింపు ఇచ్చిన సందర్భంగా బుధవారం కర్నూల్ 1,2 డిపోల వద్ద ఏపీ పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు మిఠాయిలు పంచుకుని, బాణ సంచాలు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రీజనల్ కార్యదర్శి ఏ.వి.రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత రాష్ట్ర నాయకత్వం కృషి వలన మా సంఘానికి గుర్తింపు వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నామన్నారు. దీనితో మాపై మరింత బాధ్యత పెరిగిందని ,ప్రభుత్వానికి సిబ్బందికి అనుసంధానంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కర్నూల్ 1,2 డిపో కార్యదర్శిలు ఆర్.వి.ఎం.రావు, జి.మహేశ్వర్‌రావులు మాట్లాడుతూ.. మా యూనియన్‌కు గుర్తింపు రావడానికి సహకరించిన ప్రభుత్వానికి, విసి అండ్ ఎండిలకు, ఆర్టీసీ అధికారులకు అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజుకు, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు దామోదర్‌కు, ప్రధాన కార్యదర్శి జి.వి.నర్సయ్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ముత్యాల రెడ్డి, రబ్బాని, చంద్ర, గౌడు,ఆనందు సుజయరాజు, ప్రసాదు, వీరేష్, రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.










