- సీరియస్‌గా ఉండడంతో ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స
ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : పట్టణంలోని మండగిరి పంచాయతీ పరిధిలోని బీసీ బాలికల కళాశాల హాస్టల్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న కల్పన అనే విద్యార్థినికి విషపురుగు కుట్టింది. తీవ్ర అస్వస్థత గురైన విద్యార్థినిని కల్పనాను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కర్నూలుకు వెళ్లాలంటూ వైద్యులు రిఫర్ చేశారు. హాస్టల్ వార్డెన్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆదోని నుంచి కర్నూలుకు వచ్చేందుకు సమయం ఎక్కువ అవుతుందని మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోనే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని సూచించారు. ఎస్ కే డి కాలనీ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థిని ఐసియూలో చికిత్స పొందుతుంది. జిల్లా బీసీ వెల్ఫేర్ డిడి వెంకటలక్ష్మి ఆధునిక చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పనాను పరామర్శించారు. ప్రస్తుతం విద్యార్థిని కల్పన ఆరోగ్యం కుదుటపడుతుందని ఐసీయూలో చికిత్స అందుతుందని డిడి వెంకటలక్ష్మి ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము కర్నూలుకు తీసుకుచ్చే లోపు ఆలస్యం అవుతుందని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థిని కొలుకుంటుందన్నారు. ఎస్ కే డి కాలనీలో బాలికల కళాశాలకు సమీపంలో ఉన్న హాస్టల్ను గత ఏడాది ఖాళీ చేసి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్ గాంధీ నగర్ లో హాస్టల్లో ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతం కావడం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు అపరిశుభ్రత ఉండడంతోనే విషపురుగులు కుట్టాయని విద్యార్థినిలు వాపోతున్నారు. ఈ భవనంలో ఉండలేమంటూ ఇటీవల విద్యార్థులు తమ ఆవేదనను వెలగక్కారు ప్రత్నమయం చూడకుండా వార్డెన్ నిర్లక్ష్యం కూడా ఉందని బాలికలు వాపోతున్నారు
అయోమయానికి గురి చేస్తున్నారు : విద్యార్థిని తల్లి లక్ష్మి
విద్యార్థిని కల్పన ఆదోనిలోనే మధు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతుందన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటుందంటున్నారు. డాక్టర్లు వస్తున్నారు... చూస్తున్నారు.. పోతున్నారు.. సరైన సమాధానం చెప్పడం లేదు. అయోమయానికి గురి చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించి తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని కోరుతుంది.










