Jul 14,2023 22:07

బ్యాంకాక్‌: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షాట్‌ పుటర్‌ తేజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ అదరగొట్టాడు. వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించాడు. తొలి ప్రయత్నంలోనే షాట్‌పుట్‌ను 20.23 మీటర్ల దూరం విసిరాడు. ఇరాన్‌కు చెందిన సబేరి మెహ్డీ(19.98 మీటర్లు), కజకిస్థాన్‌ అథ్లెట్‌ ఇవన్‌ ఇవనోవ్‌ (19.87 మీటర్ల) రజిత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తేజిందర్‌పాల్‌కు ఘనమైన రికార్డు ఉంది. 2019లో అతను 20.22 మీటర్లతో స్వర్ణం సాధించాడు. ఇటీవల జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో 21.77 మీటర్ల దూరం విసిరిన తేజిందర్‌పాల్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌కు క్వాలిఫై అయ్యాడు. బుడాపెస్ట్‌లో ఆగస్టు 17నుంచి ఈ పోటీలు జరగనున్నాయి.