Sep 21,2023 15:05
  • వినాయకునికి సిఐటియు నేతల వినతి

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : మునిసిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తక్షణమే పరిష్కారం చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు సరైన బుద్ధిని ప్రసాదించాలని సిఐటియు అనుబంధ మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు గురువారం వినాయకుడికి వినతి పత్రం అందజేశారు. సిఐటియు అనుబంధ మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుల నాగరాజు ఆధ్వర్యంలో సిఐటియు ఒకటవ నగర కార్యదర్శి వెంకటనారాయణ, నగర అధ్యక్షులు బండారు. ఎర్రిస్వామి, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు ఓబుళపతి, మురళి కమిటీ సభ్యులు పోతలయ్య, రాయుడు, మల్లికార్జున, కార్మికులందరూ హజరైయ్యారు. ఈ సదర్భంగా ఏటీఎం. నాగరాజు, వై.వెంకట్‌ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంఅధికారులు, ప్రజలు,కార్మికులకు 100 కు 98% మా మేనిఫెస్టో ప్రకారం న్యాయం జరిగిందన్న రాష్ట్ర ప్రభుత్వం అందులో మున్సిపల్‌ కార్మికులకు న్యాయం జరిగిందా లేదా తెలియజేయాలి లేదంటే మిగిలిన 2% మేనిఫెస్టోలో మున్సిపల్‌ కార్మికుల గురించి ఏమైనా పొందుపరిచారా తెలియజేయాలి. అదేవిధంగా అనంతపురం నగరపాలక సంస్థ నందు విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌, ఔట్సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ వేతనాలు అమలు చేస్తూ హెల్త్‌ అండ్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, 60 సంవత్సరాల పేరుతో తొలగించిన, అనారోగ్యంతో బాధపడుతున్న, చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉపాధి కల్పించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు డెత్‌ బెనిఫిట్స్‌ వెంటనే ఇప్పించాలని, మున్సిపల్‌ కార్మికులందరికీ పక్కా ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని , అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మున్సిపల్‌ కార్మికుల సమస్యల గురించి ప్రస్తావన జరగాలని మరియు ఇంకా తదితర సమస్యలన్నీ తక్షణమే పరిష్కారం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సద్భుద్దిని ప్రసాదించాలని వినాయకుని వినతి పత్రం అందజేశామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే దిశగా అడుగులు వేయాలని లేనిపక్షంలో భవిష్యత్తులో కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని దశలవారీగా ఆందోళన పోరాటాలు చేపడతామని, అవసరమైతే నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కూడా వెనకాడబోమని ప్రజలకు కలిగే అసౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గం ఉన్నతాధికారులే బాధ్యత వహించ వలసి వస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ మరియు పారిశుధ్య కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.