ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఇప్పటిదాకా తీసుకున్న రుణాలపై పూర్తిస్థాయి వివరాలు ఇస్తేనే రానున్న రోజుల్లో రుణాలు మంజూరు చేస్తామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సంబంధించి ఏడు నమూనా ఫార్మాట్లను కూడా పంపింది. విద్యుత్ రంగానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి కొంత మెత్తం రుణంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ఈ మొత్తం విడుదల కావాలంటే ఇప్పటివరకు అనుమతిరచిన మొత్తంలో ఎరత రుణం తీసుకున్నారు, దానికి ఏ అవసరాలకు ఖర్చు చేశారు తదితర వివరాలు తెలియచేయాలని కోరింది ఇదే పద్దంతిలో మొత్తం రుణ పరిమితిలో భాగంగా బహిరంగ మార్కెట్ రుణాలు, సంప్రదిరపుల ద్వారా తీసుకున్న రుణాలు, చిన్న మొత్తాల పొదుపు ద్వారా, ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలను విడివిడిగా సమర్పిరచాలని సూచించింది. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఈ మొత్తం రుణాల వివరాలు చెప్పాలని ఆదేశించింది.










