ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్ర హైకోర్టుకు అడిషనల్ జడ్జీలుగా నియమితులైన నలుగురితో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మళపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ హరినాధ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, జగడం సుమతి, న్యాపతి విజరులు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, డిజిపి కెవి రాజేంధ్రనాధ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు సిఎం వైఎస్ జగన్ రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ నజీర్‌తో మర్యాద పూర్వకంగా కలిశారు.










