ప్రజాశక్తి -అనంతపురం కార్పొరేషన్ :మాజీ డిప్యూటీ మేయర్ సుంకు శ్రీరాములు (74) గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన 2005 నుంచి 2010 వరకు డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ముక్కుసూటి తనంతో వ్యవహరించే ఆయన నగరాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్తివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అర్బన్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆయన సోదరులు ఎర్రిస్వామి రెడ్డి రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. బిఎన్నార్ ఫ్యామిలీతో సుంకు శ్రీరాములకు విడదీయరాని అనుబంధం ఉందని వారన్నారు.










