తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ... తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా... బిజెపికి మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. ఇన్నాళ్లు బిజెపిలో తనకు అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న వివేక్.. బిజెపి లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. వివేక్ వెంకటస్వామిని ఇటీవల బిజెపి ఎన్నికల మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి విదితమే. వివేక్ వెంకట స్వామి, ఆయన కుమారుడు వంశీ త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో రాహుల్ గాంధీతో వివేక్, వంశీ భేటీ కానున్నారు. ఇటీవల వివేక్ రేవంత్ రెడ్డిని కలిసి చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా, పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వివేక్ క్లారిటీ ఇచ్చారు. అలాగే వివేక్ కుమారుడిని చెన్నూరు నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.










