హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సిపిఎం ప్రకటించింది. మొదటి జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు కోసం సిపిఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించిన విధంగా మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని సిపిఎం కోరింది. అయితే హస్తం పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సిపిఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించే అవకాశముంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు.
అభ్యర్థుల వివరాలు...
భద్రాచలం (ఎస్టీ) - కారం పుల్లయ్య
అశ్వారావుపేట (ఎస్టీ) - పిట్టల అర్జున్
పాలేరు - తమ్మినేని వీరభద్రం
మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్
వైరా (ఎస్టీ) - భూక్యా వీరభద్రం
ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్
సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి
మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) - చినవెంకులు
భువనగిరి - కొండమడుగు నర్సింహ
జనగాం - మోకు కనకారెడ్డి
ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య
పటాన్‌చెరు - జె. మల్లికార్జున్
ముషీరాబాద్ - ఎం. దశరథ్










