Sep 23,2023 17:13

గుజరాత్‌ : తమిళనాడులోని తిరుచురాపల్లి-శ్రీ గంగానగర్‌ మధ్య నడిచే హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు ుంటలు చెలరేగాయి. ఇది వల్సాడ్‌ స్టేషన్‌ సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలుకు చెందిన బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌లో మధ్యాహ్నం సమయంలో మంటలు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో పక్క బోగీల్లోని ప్రయాణికులందరినీ వెంటనే దించేశారు. సమాచారం అందడంతో వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. అంతా సురక్షితంగా ఉన్నారని , మంటలు అదుపులో ఉన్నాయని తెలుస్తోంది.