Jul 15,2023 22:15

విండీస్‌పై ఇన్నింగ్స్‌ 141పరుగుల తేడాతో భారత్‌ గెలుపు
డొమినిక: తొలిటెస్ట్‌లో భారత ఘన విజయం సాధించింది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్‌ జట్టు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(7/71) మాయాజాలానికి 140పరుగులకే కుప్పకూలింది. భారతజట్టు మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను 5వికెట్ల నష్టానికి 421పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. భారతజట్టులో జైస్వాల్‌ అత్యధికంగా 171పరుగులు కోహ్లి(76)పరుగులు చేశారు. దీంతో భారతజట్టుకు 217పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ జట్టు అశ్విన్‌(7/71), జడేజా(2/38) దెబ్బకు 130పరుగులకే కుప్పకూలింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు జైస్వాల్‌కు లభించింది. .
అశ్విన్‌ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 12 వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్‌ టెస్టుల్లో 10కన్నా ఎక్కువ వికెట్లు తీయడం ఇది ఎనిమిదోసారి. ఇంతకుముందు మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే కూడా 8సార్లు టెస్టుల్లో పదేసి వికెట్లు పడగొట్టాడు. అలాగే టెస్టుల్లో 34సార్లు అయిదేసి వికెట్లు తీసుకున్నాడు. మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే 35సార్లుకు చేరువయ్యాడు.. టెస్టుల్లో అయిదేసి వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్‌ ప్రస్తుతం అయిదో స్థానంలో నిలిచాడు. ఇక కరీబియన్‌ పిచ్‌లపై ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శించిన రెండో స్పిన్నర్‌గా అశ్విన్‌ నిలిచాడు. 1973లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో టోనీ గ్రేగ్‌ 156 రన్స్‌ ఇచ్చి 13 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్‌ కన్నా ఇదే బెటర్‌ రికార్డు.
స్కోర్‌బోర్డు..
వెస్టిండీస్‌ : 150, 130
భారత్‌ : 421/5డిక్లేర్డ్‌