ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించి దోమ కాటు వల్ల కలిగే రోగాలపై అవగాహన పెంచాలని మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నగేష్, మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశులు సిబ్బందిని సూచించారు. స్థానిక కృష్ణ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రజలకు దోమ కాటు వల్ల కలిగే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గునియా, మొదలగు వ్యాధులపై అవగాహన కలిగించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఇంటింటి కెళ్ళి జ్వరాలు ఉన్నవారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో చికిత్స అందజేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, దోమలు పుట్టకుండా , కుట్టకుండా అవగాహన పెంచాలని , ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పనికిరాని తొట్లు, డబ్బాలు, టైర్లు, కొబ్బరిచిప్పలు, మొదలగువాటిలో వర్షపు నీరు చేరి దోమలు ఉత్పత్తి జరుగుతాయని వాటిని వెంటనే తొలగించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు, హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా, పబ్లిక్ హెల్త్ నర్స్ సరస్వతి, హెల్త్ అసిస్టెంట్లు ప్రకాష్ రావు, పద్మ హెల్త్ ప్రొవైడర్ అంజలి, ఆరోగ్య ఆశా కార్యకర్తలు పాల్గన్నారు










