Oct 01,2023 08:16

చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కూనూర్‌లోని మరపాలెం సమీపంలో పర్యాటక బస్సు లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. 35 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి. బస్సు ఊటీ నుంచి మెట్టుపాళయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కూనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కోయంబత్తూరు జోన్‌ డిఐజి శరవణ సుందర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మృతి చెందగా, మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.