జైపూర్ (రాజస్థాన్) : రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును వ్యాన్ ఢీకొట్టడంతో 11 మంది మృతి చెందారు. మరో 15మందికి గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు గుజరాత్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళుతుండగా, జయపుర - ఆగ్రా జాతీయ రహదారిపై హంత్రా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకెళితే ... రాజస్థాన్‌లోని భావ్‌నగర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథురకు బయలుదేరిన బస్సు బుధవారం తెల్లవారుజామున లఖ్నాపూర్‌కు చేరుకుంది. అక్కడి ఆంత్రా ఫ్లైఓవర్‌పై హాల్టింగ్‌కు ఆగింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న బస్సును గమనించని ఓ లారీ, అతివేగంగా వచ్చి వెనుక నుంచి బస్సును ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, మరో ఆరుగురు మృతి చెందారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 15 మందికి గాయాలవ్వగా వారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాజస్థాన్ సిఎం దిగ్భ్రాంతి...
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లౌత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం ప్రకటించారు.










