అమరావతి : చంద్రమోహన్ తెలుగు ప్రజల హఅదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని సిఎం జగన్ పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
'' ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను '' అంటూ సిఎం జగన్ ట్వీట్ చేశారు.










