Oct 21,2023 13:12

ప్రజాశక్తి-రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్‌ అయ్యారు. ఈ సారి నందమూరి రామకృష్ణ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ములాఖత్‌లో చంద్రబాబును కలిశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ జైలుకు చేరుకున్న వారు చంద్రబాబుతో 40 నిముషాల పాటు ములాఖత్‌ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత తాజా పరిస్థితులపై కుటుంబ సభ్యులు ఆయనకు వివరించినట్టుగా తెలుస్తోంది.