ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా ) : కానూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఉసులుమర్రు గ్రామంలో శనివారం ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్నిపి హెచ్ సి వైద్యలు డాక్టర్ పి. తేజ ఆధ్వర్యంలో నిర్వహంచారు. ఈసందర్భంగా సాధారణ వైద్యం -100, గర్భిణీలు -16, భాలింతలు -2, రక్తపోటు -42, మధుమేహం -68 కి వైద్య,పరీక్షలు చేసి చికిత్స అందించారు. అనంతరం పాఠశాలలో పిల్లలను పరీక్షించి చికిత్స వ్యక్తిగత శుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఆగస్టు 10 వ తేదీన జరుగే ''జాతీయ నూలుపురుగుల నివారణ దినోత్సవం గురించి విద్యార్థులకు తెలియజేశారు. గర్భిణీ నక్క సౌమ్య స్కానింగ్ కోసం వైసిపి నాయకులు దాత. సూరిబాబు రూ.2550/ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి సూపెర్వైజర్ పి. రాజసులోచన, కే. వి. నాగేశ్వర రావు, మరియు సిబ్బంది జి. దుర్గా ప్రసాద్, ఏ ఎన్ ఏం అక్కమ్మ, ఎం ఎల్ హెచ్ పి. జ్యోతికుమారి ఆశాలు తదితరులు పాల్గొన్నారు.










