Oct 27,2023 07:53

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో :టిటిడి ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు (ఫేసియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌) విధానాన్ని టిటిడి పరిపాలనా భవనంలో ఇఒ ఎవి.ధర్మారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ టిటిడిలో ఎనిమిది 8 వేలకుపైగా రెగ్యూలర్‌ ఉద్యోగులు, 10 వేలకుపైగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ ముఖ ఆధారిత హాజరును అమలు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, పని సామర్థ్యం పెరుగుతాయన్నారు. తిరుమల, తిరుపతిలోని టిటిడి కార్యాలయాలతోపాటు విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఇతర సంస్థల్లో ముఖ ఆధారిత హాజరును అమలు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, డిప్యూటీ ఇఒ గోవిందరాజన్‌, ఐటి జనరల్‌ మేనేజర్‌ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.