- దక్షిణాఫ్రికా చేతిలో 3-2గోల్స్‌తో ఓటమి
సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. బుధవారం జరిగిన గ్రూప్-జి చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాప్రికా మహిళలజ్టు ఏకంగా ఇటలీ జట్టును ఓడంది. రెండు అర్ధభాగాల సమయం పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా జట్టు 3-2గోల్స్ తేడాతో ఇటలీని చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్నా ఇటలీ జట్టు ప్రి క్వార్టర్స్‌కు చేరేది. మరో మ్యాచ్‌లో స్వీడన్ జట్టు 2-0గోల్స్ తేడాతో అర్జెంటీనాను ఓడించి 9పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. దీంతో ఈ గ్రూప్ నుంచి స్వీడన్, దక్షిణాఫ్రికా జట్లు నాకౌట్‌కు చేరగా.. ఇటలీ, అర్జెంటీనా జట్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. నేటితో గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు ముగియనుండగా.. శనివారం నుంచి నాకౌట్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
మొరాకో × కొలంబియా
దక్షిణ కొరియా × జర్మనీ
(మ.3.30గం||లకు)










