Aug 07,2023 21:15

సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు ప్రవేశించాయి. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌ పోటీల్లో ఇంగ్లండ్‌ మహిళలజట్టు పెనాల్టీ షూటౌట్‌లో నైజీరియాపై, ఆస్ట్రేలియా జట్టు డెన్మార్క్‌పై విజయం సాధించాయి. ఇంగ్లండ్‌-నైజీరియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో నిర్ణీత, అదనపు సమయం పూర్తయ్యేసరికి ఇరుజట్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యాయి. అనంతరం పెనాల్టీ షూటౌట్‌లో ఇంగ్లండ్‌ జట్టు 4-2గోల్స్‌ తేడాతో నైజీరియాను చిత్తుచేసింది. మరో పోటీలో ఆస్ట్రేలియా జట్టు 2-0గోల్స్‌ తేడాతో డెన్మార్క్‌ను ఓడించింది. ఆస్ట్రేలియా తరఫున కల్టిన్‌ ఫోర్డ్‌(29వ ని.), హైలీ రాసో(70వ ని.లో) ఒక్కో గోల్‌ కొట్టారు. బంతి ఎక్కువభాగం డెన్మార్క్‌ పక్షంలో ఉన్నా ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడం వివేషం.