Mar 21,2023 16:02

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు కృష్ణాజిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ సంయుక్త అధ్వర్యంలో బచ్చుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకోసం చేస్తున్న ఏర్పాట్లు మంగళవారం డిఆర్వో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. నాదస్వరం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, అర్చకులకు సత్కారం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.