
ప్రజాశక్తి-హలహర్వి (కర్నూలు) : మండల కేంద్రమైన హలహార్వి అర్బీకే లో నివసించిన మండల వ్యవసాయ సలహా మండల మీటింగ్ కు హాజరైన వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భీమప్ప చౌదరి అధ్యక్షతన మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం శుక్రవారం జరిగింది. ఇందుకుగాను జడ్పిటిసి లింగప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సలహా సమావేశంలో భీమప్ప చౌదరి మాట్లాడుతూ ... రబీ సీజన్లో ప్రతి రైతు కూడా పంట నమోదు చేయించుకోవాలన్నారు. తర్వాత పప్పుశనగ అయితేనేమి జొన్నలైతేనేమి ఏ పంటైనా సరే ప్రతి రైతు కూడా రబీ సీజన్లో పంట నమోదు చేయించుకుంటే గవర్నమెంట్ నుంచి అన్ని సబ్సిడీలు కూడా రైతుకు వర్తిస్తాయని చెప్పారు. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ఇన్సూరెన్స్ ప్రకటించినా కాని రైతులు నష్టపోకుండా ఉంటారని అన్నారు. ప్రతి రైతు కూడా రబీ సీజన్ పంటను చేయించుకోవాలన్నారు. బ్యాంకులో ఏ క్రాప్‌కైతే రుణం తీసుకొని ఉంటారో ఆ క్రాపు ఈ క్రాప్ లో ఉంటే మాత్రమే ఇన్సూరెన్స్ లైన్ అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి వర్తిస్తాయని భీమప్ప చౌదరి వివరించారు.