సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి 50వేల మెజార్టీతో గెలుస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. ఉత్తమ్ సమక్షంలో పలువురు బిఆర్‌ఎస్ నేతలు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. కాంగ్రెస్‌లోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. సమన్వయంతో పని చేసి కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.










