లండన్ : ఇంగ్లండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఏడాదిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిన్.. మళ్లీ బంతిని పట్టి మైదానంలోకి దిగడం కష్టమని భావించి ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. 'గత 12 నెలలుగా నా శరీరంతో పోరాడుతున్నా. చివరకు అలసిపోయానని ఒప్పుకుంటున్నా. ఇన్నిరోజులు క్రికెట్ ఆడినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా.. అని సోమవారం ట్విటర్‌వేదికగా తెలిపాడు. కుడిచేతి వాటం పేసర్ అయిన ఇంగ్లండ్ తరఫున 36టెస్టులు, 69వన్డేలు, 21 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 30.40 సగటుతో 125 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ ప్రదర్శన 6/125. వన్డేల్లోనూ ఫిన్ 102 వికెట్లు తీశాడు. కౌంటీల్లో మిడిల్‌సెక్స్ జట్టుకు ఆడిన ఫిన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫిన్‌ను ఒకప్పుడు ఆసీస్ లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ తో పోల్చేవారు.










