275 పరుగుల ఆధిక్యత
యాషెస్ సిరీస్ నాల్గో టెస్ట్
మాంచెస్టర్: యాషెస్ సిరీస్ నాల్గో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 384 పరుగులతో శుక్రవారం మూడోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు 107.4ఓవర్లలో 592పరుగులకు ఆలౌటైంది. రూట్(84), బ్రూక్(61), స్టోక్స్(51), బెయిర్‌స్టో(99నాటౌట్) అర్ధసెంచరీలతో మెరిసారు. బెయిర్‌స్టో సెంచరీకి ఒక్క పరుగు చేయాల్సి దశలో జేమ్స్ ఆండర్సన్(5) ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాజట్టు 317పరుగులు చేయడంతో ఆతిథ్య జట్టుకు భారీ ఆధిక్యత లభించింది. హేజిల్‌వుడ్‌కు ఐదు, స్టార్క్, గ్రీన్‌కు రెండేసి, కమిన్స్‌కు ఒక వికెట్ దక్కాయి.










