Jul 29,2023 22:15

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ జట్టు రాణిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 12పరుగులు వెనుకబడ్డ ఇంగ్లండ్‌ జట్టు మూడోరోజు టి విరామ సమయానికి 49ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 265పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజ్‌లో బెయిర్‌స్టో(34), జో రూట్‌ (61) ఉన్నారు. శుక్రవారం ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 295పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఆ జట్టుకు స్వల్ప ఆధిక్యత లభించింది. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2ా1 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే. కడపటి వార్తలందే సమయానికి ఇంగ్లండ్‌ జట్టు 60 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 309పరుగులు చేసింది. రూట్‌, బెయిర్‌స్టో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు.