జలపాతాలు నిర్మిస్తారా? అంటే నిర్మించగలం అంటున్నారు చైనీయులు.. నైరుతి చైనాలోని ఈ ఆకాశహార్మ్యం.. ఇంజినీరింగ్ అద్భుతానికి ప్రతీక. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత జలపాతం. దీని ఎత్తు 108 మీటర్లు (350 అడుగులు). లిబియాన్ ఇంటర్నేషనల్ బిల్డింగ్‌గా పేరొందిన ఈ జలపాత భవనంలో షాపింగ్ మాల్స్, హోటళ్లు, పలు కార్యాలయాలు ఉన్నాయి. భలే భలే..!














