Jun 04,2023 09:31

ఈ చీరల్ని చూస్తుంటే చిన్నప్పటి సంగతులు గుర్తుకొస్తున్నాయి కదూ..! చిన్నప్పుడు అమ్మమ్మదో, నానమ్మదో చీరల్లోంచి ఓ మంచి రంగుది ఎంచుకొని, అద్దం ముందు నిలబడి చీర కట్టుకోవడం ప్రాక్టీసు చేసుకుంటూ తెగ ఫీలైపోతారు. ఆ చీరకట్టును అద్దంలో చూసుకుంటే ఆ ఆనందానికి హద్దులే ఉండవు. అలాగే ఇక్కడున్న చీరలూ అమ్మమ్మ చీరలా అందంగా ఉన్నాయి కదూ..! ఎన్నో జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా, గుర్తుండిపోయేలా చేసేవి. మండే ఎండల్లో మరి ఈ శారీస్‌ సౌకర్యమే హాయి..!