శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ షోపియాన్‌లోని అల్షిపొరా ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన మొరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూక్ అబ్రార్‌గా గుర్తించారని 'టైమ్స్ నౌ' పేర్కొంది. అయితే ఇందులో అబ్రార్ కు 2023 ఫిబ్రవరిలో పుల్వామాలో కాల్చి చంపిన కశ్మీరీ పండిట్ సంజరు శర్మ హత్యలో ప్రమేయం ఉందని కాశ్మీర్ పోలీసులు నిర్ధారించారు. ఈ ఎన్ కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










