Sep 19,2023 16:18

అనంత్‌నాగ్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో లష్కరే తోయిబా కమాండర్‌ ఉజైర్‌ ఖాన్‌ భద్రతా దళాల కాల్పుల్లో మృతిచెందాడు. ఈ విషయాన్ని ఏడీజీపీ విజయ్ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడు రోజుల నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులు ఉజైర్‌ ఖాన్‌ మృతితో ముగిసినట్లు తెలిపారు. ఉజైర్‌ ఖాన్‌తో పాటు మరో వ్యక్తికి చెందినట్లు తెలిపారు. వారి దగ్గర ఉన్న ఓ వెపన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంత్‌నాగ్‌ ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు కూడా మృతిచెందిన విషయం తెలిసిందే.