Sep 05,2023 15:03

ప్రజాశక్తి-ఏలూరు( అన్నేవారి గూడెం) : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా లన్నేవారి గూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అన్నేవారి గూడెం గ్రామానికి చెందిన గుర్రం మావుల్లయ్య (25) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి మద్యం అలవాటు ఉండటంతో వచ్చిన కూలీ డబ్బులు మొతం మద్యానికి ఖర్చు చేయడంతో తండ్రి మందలించాడు. ఈ క్రమంలో మావుల్లయ్య గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న మావుల్లయ్యను ఇరుగుపొరుగు వారి సహకారంతో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ ఉదయం ఏడు గంటలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.