ప్రజాశక్తి-హలహార్వి(కర్నూలు) : ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుచేసిన ప్రతి పంటను ఈక్రాప్ బుకింగ్ చేసుకోవాలని అని ఎడిఎ సునీత పేర్కొన్నారు. హలహర్వి గ్రామంలోని రామకృష్ణ రైతు పొలంలో పంట నమోదును సోమవారం పరిశీలించారు. ఈ సీజన్లో వేసిన పంటలను జియో ట్యాగ్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని, పంటల నమోదు చేయకపోతే, ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు, రైతు భరోసా, ఇన్సూరెన్స్, వర్తించవని తెలిపారు. ఈ క్రాప్ బుకింగ్ కు ప్రతి ఒక్క రైతులు సహకరించాలన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఖరీఫ్ లో పంటల సాగు చేసిన ప్రతి రైతులు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం, సర్వే నెంబర్లు తదితర వివరాలు ఈ క్రాప్ యాప్ లో పొందుపరుస్తారని తెలిపారు. దీని వలన ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పంటల బీమా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే రైతు పథకాలు పొందాలన్న తప్పనిసరిగా ఈ క్రప్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్ అసిస్టెంట్ ఇంద్రజ తలారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










