Oct 10,2023 11:18

ఢిల్లీ : ఢిల్లీలోని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే సంజరు సింగ్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయగా.. తాజాగా మరో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ నివాసంలో ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడుల చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. అమానతుల్లా ఖాన్‌కు చెందిన ఇల్లు, కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. వక్ఫ్‌ బోర్డు భూమికి సంబంధించిన వ్యవహారం. హవాలా లావాదేవీలపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు.. ఢిల్లీ అసెంబ్లీలోని ఓఖ్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే అతను ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు.