Nov 08,2023 15:00

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వికలాంగులు తదితర ఓటర్లతో పాటు పోలింగ్‌ బూత్‌ లకు సహాయకులుగా వచ్చేవారి చేతి వేలిపై కూడా సిరా గుర్తును వేయాలని నిర్ణయించింది. సహాయకుల కుడి చేతి చూపుడు వేలికి ఇంకు గుర్తు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఓటర్లకు ఎడమ చేతి వేలిపై సిరా గుర్తు పెడతారు. పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ఏజెంట్లుగా సర్పంచ్‌ లు, వార్డు సభ్యులు కూర్చునే అవకాశాన్ని కూడా సీఈసీ కల్పించింది. మాక్‌ పోలింగ్‌ ను ఉదయం 5.30 గంటలకు ప్రారంభించాలని సూచించింది.