ప్రజాశక్తి-వన్‌టౌన్ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు నేడు శ్రీమహాచండీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఏడాది నుంచే కొత్తగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. ఉదయం 4గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ మహాచండీ దేవి రూపంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.










