ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : చల్లపల్లి మండలంలోని పురిటీగడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండూరు సురేష్ కుమార్ వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌ను శనివారం అందజేశారు. సురేష్ కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం విద్యార్థులకు సమకూర్చిన డ్రైఫ్రూట్స్‌ను ట్రస్ట్ ప్రతినిధి దేవరపల్లి సురేష్ విద్యార్థులకు అందచేశారు. ఈ సందర్భంగా కొండూరు సురేష్ కుమార్ మాట్లాడుతూ..విద్యార్థులు చదువుల్లో, ఆటల్లో రాణించాలంటే బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలన్నారు. డ్రై ఫ్రూట్స్ వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలతో పాటు కండరాలు, ఎముకలు ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.నాగలక్ష్మి, జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










