ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరిలో భాగంగా శనివారం సచివాలయల్లో సిపిఎం నాయకులు వినతి పత్రాలు అందజేశారు. సిపిఎం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. త్యవసర ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్ట లేకపోతున్నాయన్నారు. దీంతో సామాన్య ప్రజల పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది అన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేకుంటే ప్రజలందరిని కలుపుకోని పెద్దఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ప్రతాప్, నాగరాజు, సుంకన్న, రామిరెడ్డి, ఓబులేసు, టైలర్ లాలన్న తదితరులు పాల్గొన్నారు.










